Bhatti Vikramarka: అధికారంలోకి వచ్చాక రూ. 52వేల 118 కోట్లు అప్పు చేశాం..! 3 d ago
తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలికంగా చర్చించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేసారు. మొత్తం అప్పు రూ. 6 లక్షల 71 వేల కోట్లు ఉందని పేర్కొన్నారు. అప్పులపై హరీష్‌రావు అనేక ఆరోపణలు చేశారని విమర్శించారు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు చెప్పడం హరీష్‌రావుకు వెన్నతో పెట్టిన విద్య అని ఏద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లులే రూ.40వేల 150 కోట్లు పెట్టారని చెప్పారు. అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ. 7 లక్షల 19 వేల కోట్లు ఉందని స్పష్టం చేశారు. మేము అధికారంలోకి వచ్చాక రూ. 52 వేల 118 కోట్లు అప్పు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.